అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ రోజు నందమూరి హీరోలంతా కలిసి నందమూరి వంశాభిమానులను కలవడానికి వచ్చేవారు. ఆ కార్యక్రమానికి నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ ఆడియో రిలీజ్ ప్రోగ్రాం వేదికయ్యేది. కానీ హఠాత్తుగా జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్ వల్ల నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణించడంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు కూడా శోఖ సముద్రంలో మునిగిపోయారు.
ఈ కారణంగా పటాస్ టీం ఈ రోజు రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్ర ఆడియోని వాయిదా వేసారు. కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఈ బాధ నుండి కోలుకున్నాక ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఉంటుంది. త్వరలోనే మరో అధికారిక ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. ఇప్పటివరకూ పటాస్ సినిమా ఒకటి రెండు పాటల మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమాలోని ‘అరె ఓ సాంబ’ సాంగ్ ని రీమిక్స్ తెలియజేశాం.
కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది నటిస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


