లేటెస్ట్ : సూపర్ స్టార్ రజినీకాంత్ పై ‘పఠాన్’ డైరెక్టర్ సూపర్ ఎలివేషన్

లేటెస్ట్ : సూపర్ స్టార్ రజినీకాంత్ పై ‘పఠాన్’ డైరెక్టర్ సూపర్ ఎలివేషన్

Published on Feb 4, 2023 9:00 PM IST


ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో పఠాన్ మూవీ తెరకెక్కించిన యువ దర్శకుడు సిద్దార్థ ఆనంద్, ఆ మూవీ యొక్క భారీ సక్సెస్ తో ప్రస్తుతం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి నుండి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పఠాన్ మూవీ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ స్థాయి కలెక్షన్స్ తో పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పై పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రసంశలు కురిపిస్తూ ఉండడం విశేషం. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు డైరెక్టర్ సిద్దార్ధ ఆనంద్, తనకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పై ఉన్న వల్లమాలిన అభిమానాన్ని వ్యక్తపరిచారు.

మీరు చేయనున్న యాష్ రాజ్ ఫిలిమ్స్ వారి స్పై యూనివర్స్ లో షారుఖ్, సల్మాన్, హృతిక్ వంటి బడా స్టార్స్ నటిస్తున్నారు కదా, మరి వారిని ఢీ కొట్టే విలన్ గా ఒకవేళ రజినికాంత్ ఉంటే ఎలా ఉంటుందని మీరు అభిప్రాయం అని అడుగగా, ఇది నిజంగా పెద్ద సర్ప్రైజింగ్ ప్రశ్న అని, అసలు రజినీకాంత్ గారిని గెలవాలి అంటే వారి ప్రక్కన కూడా రజినీకాంత్ ఉండాల్సిందే అని అన్నారు. ఇక ఈ రేంజ్ సూపర్ ఎలివేషన్ ని బట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ కి కేవలం ఆడియన్స్ లో మాత్రమే కాదు అనేకమంది సినీ ప్రముఖుల్లో సైతం ఏ స్థాయి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు