సంక్రాంతి కానుకగా పవన్ – వెంకీల ‘గోపాల గోపాల’

సంక్రాంతి కానుకగా పవన్ – వెంకీల ‘గోపాల గోపాల’

Published on Jul 20, 2014 5:30 PM IST

Gopala_Gopala_Movie Openin

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ కాంబినేషన్ సినిమాల్లో ‘గోపాల గోపాల’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పై ఇండస్ట్రీలోనే కాకుండా అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా ఈ సినిమాని అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదట్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నానక్రామ్ గూడాలో జరుగుతోంది. వెంకటేష్ పై వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ చిత్ర టీం షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. వెంకటేష్ కామన్ మాన్ గా కనిపించనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడుగా కనిపించనున్నాడు. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి రీమేక్. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు