లాక్ డౌన్ తరువాత పవన్ ఫిల్మ్ సిటీకే ?

లాక్ డౌన్ తరువాత పవన్ ఫిల్మ్ సిటీకే ?

Published on May 16, 2020 9:19 PM IST

Pawan Kalyan

కరోనా పై యుద్ధంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలను ఎప్పటికప్పుడు బాగానే అప్రమత్తం చేస్తున్నారు. ఇక పవన్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలనూ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం లాక్ డౌన్ తరువాత పవన్ క్రిష్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతునట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. అయితే మధ్యలో పవన్ ఒక వారం గ్యాప్ ఇచ్చి
వకీల్ సాబ్ బ్యాలెన్స్ షూట్ ను కూడా పూర్తి చేస్తాడట.

కాగా క్రిష్ తో చేస్తోన్న ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ విడుదల అయిన నెలకే పెద్దగా గ్యాప్ లేకుండానే ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

అలాగే పవన్ తరువాత సినిమాల పై కూడా ఇప్పటికే అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ తో ఒక సినిమా, దర్శకుడు డాలీతో మరో సినిమాని పవన్ చేయబోతునట్లు ఆ రూమర్స్ సారాంశం. మరి వీటిల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు