పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. మళ్ళీ తమకు పాత రోజులు వచ్చాయని భావించారు. కానీ లాక్ డౌన్ మూలాన అందుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న పింక్ రీమేక్ “వకీల్ సాబ్” లో పవన్ నటిస్తున్నారు. అలాగే దీని తర్వాత మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో కూడా పవన్ నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో క్రిష్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ భారీ పీరియాడిక్ చిత్రాన్ని సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రామాణికాలతో పూర్తి చేసి వేసవిలో విడుదల చెయ్యాలని ప్లానింగ్ లో ఉన్నారట. ఈ చిత్రం కోసం కూడా పవన్ ఫ్యాన్స్ గట్టిగానే ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం వస్తుందో లేదో చూడాలి.


