సాలిడ్ కం బ్యాక్ కోసం పవన్,మహేష్ దర్శకుడు.!

Published on Jun 5, 2020 11:05 pm IST

మన టాలీవుడ్ లో ఉన్న సీనియర్ మోస్ట్ దర్శకులలో జయంత్ సి పరాన్జీ కూడా ఒకరు. ఒకప్పుడు టాప్ హీరోస్ అందరితో సినిమాలు తీసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “తీన్ మార్” మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుతో “టక్కరి దొంగ” లాంటి అద్భుతమైన సినిమాను తీశారు.

అలాంటి జయంత్ నుంచి చివరగా 2017 లో ప్రముఖ పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ “జయ్ దేవ్” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పటికే ఎన్నో చక్కని చిత్రాలను తెరకెక్కించిన జయంత్ సి పరాన్జీ ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అందుకే ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టుకు గాను బాహుబలి,RRR సృష్టికర్త విజయేంద్ర ప్రసాద్ గారు కథ అందిస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాలా ఉండబోతుంది అని తెలుస్తుంది. మరి ఇంకా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More