‘జీవన్ ధాన్’ కు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ !

31st, July 2017 - 04:20:13 PM


సినీ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ‘జీవన్ ధాన్’ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. ఏపి ప్రభుత్వం స్వయంగా ఆయన్ను ప్రచారకర్తగా ఉండాలని కోరగా పవన్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ ‘జీవన్ ధాన్’ అనేది అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్.

ఇప్పుడిప్పుడే అవయవదానం ప్రాముఖ్యతను తెలుసుకుంటున్న ప్రజలు పవన్ అంబాసిడర్ గా ఉండటం వలన ఆర్గాన్ డొనేషన్ కు ముందుకొస్తారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరణం తర్వాత కూడా జీవించండి అనేది ఈ ఆర్గనైజేషన్ యొక్క స్లోగన్. ఇకపోతే ఉద్దానం సమస్యపై సచివాలయంలో సుమారు 50 నిముషాలు పవన్, హార్వర్డ్ డాక్టర్లతో సమావేశమైన చంద్రబాబు సమస్య పట్ల సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.