రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘నేల టికెట్టు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను మే 24న ప్రేక్షకులకందివ్వనున్నారు. అలాగే చిత్ర ఆడియోను మే 10వ తేదీన భారీ వేడుక నిర్వహించి విడుదలచేయనున్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని కొన్ని రోజుల క్రితమే వార్తలురాగా ఇప్పుడు ఆ వార్తే నిజమైంది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వేడుకకు రానున్నారని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శక్తి కాంత్ సంగీతాన్ని అందిస్తుండగా నూతన నటి మాళవిక శర్మ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయంకానుంది.
