తన అభిమాన పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన పవన్!

తన అభిమాన పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన పవన్!

Published on Jul 7, 2016 9:52 AM IST

BARATAM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద సాహిత్య అభిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు సాహిత్యంలో ఎన్నో పుస్తకాలు చదివిన ఆయన, పలు రాజకీయ ప్రసంగాల్లో ఆ పుస్తకాల్లోన్ని తనకిష్టమైన మాటలనే ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక భారతం’ అనే పుస్తకం తాను ఎంతగానో ఇష్టపడే పుస్తకాల్లో ఒకటని చెబుతూ వచ్చే పవన్, తాజాగా ఆ పుస్తకం రీ పబ్లిషింగ్ కోసం తన వంతు సాయాన్ని అందించడం విశేషంగా చెప్పుకోవాలి.

PAWAN

ప్రస్తుతం మార్కెట్లో ‘ఆధునిక భారతం’ ఎక్కడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే శేషేంద్ర శర్మ కుటుంబం ఆ పుస్తకాన్ని మళ్ళీ పబ్లిష్ చేయాలని భావించినా సరైన ఆర్థిక వనరులు లేక ఆగిపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వెంటనే పుస్తకం రీ పబ్లిషింగ్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందించి ఇప్పుడు ఆ పుస్తకాలు మార్కెట్‌లోకి వచ్చేలా చేశారు. నేటి యువత ఈ పుస్తకం తప్పక చదవాలని, ఇలాంటి పుస్తకాలు మరుగున పడకూడదనే ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులో తెచ్చానని పవన్ తెలిపారు.

తాజా వార్తలు