మొత్తానికి పెద్ద పండుగే చేసిన పవన్ ఫ్యాన్స్

Published on Mar 3, 2020 8:24 pm IST

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ ఫస్ట్ లుక్, టైటిల్ నిన్న సాయంత్రం రివీల్ అయ్యాయి. చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే పేరును నిర్ణయించారు. రెండేళ్ల తర్వాత పవన్ చేస్తున్న సినిమా కావడంతో ఫస్ట్ లుక్ విడుదలనే అభిమానులు విపరీతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫస్ట్ లుక్ బయటికొచ్చిన కొద్దిసేపటికే భారీ ఎత్తున బ్యానర్లు ఎర్పటు చేశారు. నెల్లూరు, కర్నూల్, వైజాగ్, భీమవరం, కడప లాంటి పలు ప్రాంతాల్లో ప్రధాన థియేటర్ల వద్ద భారీ హోర్డింగ్స్ ఏర్పాటుచేసి బానాసంచా పేల్చి, కేక్ కటింగ్స్ నిర్వహించి హంగామా చేశారు.

ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా విడుదలకు చేసిన హడావుడి చేశారు. ఈ క్రేజ్ చూస్తే ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల రోజున హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో అయితే ఫస్ట్ లుక్ ఇండియా టాప్ ట్రెండింగ్లో ఉండటం విశేషం. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More