దిల్ రాజు పై తీవ్ర అసహనంలో పవన్ ఫ్యాన్స్..!

Published on Feb 24, 2020 9:02 am IST

టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. వెండి తెరపై పవన్ ని ఎప్పుడు చూస్తామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ మొత్తం మూడు సినిమాలు ప్రకటించగా వాటిలో ముందుగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న పింక్ రీమేక్ మే నెలలో విడుదల కానుంది.

ఐతే ఈ లోపు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తో ఎంజాయ్ చేద్దాం అని చూస్తున్న ఫ్యాన్స్ కి పింక్ దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు తీరు అసహనానికి గురి చేస్తుంది. పింక్ సినిమా మరో మూడు నెలల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఇంత వరకు కనీసం హీరోయిన్ గురించి అప్డేట్ ఇవ్వలేదు. అనేక మంది హీరోయిన్స్ పేర్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టమైన ప్రకటన లేదు. అలాగే మూవీ టైటిల్ కూడా ప్రకటించలేదు. దీనితో పవన్ ఫ్యాన్స్ మాకు హీరోయిన్ మరియు టైటిల్ పై అప్డేట్ ఇవ్వండంటూ దిల్ రాజుని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :