పవన్ సినిమా ఇండస్ట్రీ హిట్.. ఇదే సెంటిమెంట్

పవన్ సినిమా ఇండస్ట్రీ హిట్.. ఇదే సెంటిమెంట్

Published on Feb 10, 2021 12:35 AM IST

Pawan Kalyan 1

పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ సునామీ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ‘గబ్బర్ సింగ్, అత్తారింటికిదారేది’ లాంటి సినిమాల కలక్షన్లే అందుకు నిదర్శనం. అందుకే దర్శకులు చేయాల్సిందల్లా పవన్ సినిమాను బాగుంది అనే టాక్ వచ్చేలా తెరకెక్కించడమే, ఆ టాక్ వస్తే మిగతాదంతా పవన్ క్రేజ్ మీద నడిచిపోతుందని అంటుంటారు చాలామంది. కానీ బాగుందనే టాక్ తెచ్చుకోవాలంటే ముందు అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోగలగాలి.

అయితే ఈసారి క్రిష్ సినిమా పక్కా హిట్ అంటున్నారు ఫ్యాన్స్. అదెలా అంటే సినిమాకు ఒక సెంటిమెంట్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంగీతం కీరవాణిగారు చేస్తున్నారు. కీరవాణి పవన్ సినిమాకు పనిచేయడం ఇదే మొదటిసారి. గతంలో కీరవాణి చిరంజీవికి మొదటిసారి చేసిన సినిమా ‘ఘరానా మొగుడు’. ఆ సినిమా సూపర్ హిట్టయింది. అలాగే రామ్ చరణ్ కు కీరవాణి మొదటిసారి చేసిన సినిమా ‘మగధీర’. ఈ సినిమా కూడ ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ మేరకు కీరవాణి పవన్ కు చేస్తున్న మొదటి సినిమా ఇదే కాబట్టి ఇది కూడ పెద్ద విజయాన్ని సాధిస్తుందని జోస్యం చెబుతున్నారు అభిమానులు. మరి వారి ప్రిడిక్షన్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు