పవన్ ఫ్యాన్స్ ఇంకా తమ టార్గెట్ రీచ్ కాలేకపోయారు.!

Published on Jan 17, 2021 4:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “వకీల్ సాబ్”. హిందీ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కం బ్యాక్ చిత్రంగా ప్లాన్ చేశారు. దీనితో ఇది ఒక రీమేక్ సినిమా అయ్యినప్పటికీ పవన్ మంచి అంచనాలు నెలకొన్నాయి.

దీనితో అలాగే ఈ సినిమా టీజర్ కోసం కూడా భారీ అంచనాలు పెట్టుకొని నెవర్ బిఫోర్ రికార్డులు కొడతామని విడుదలకు ముందు ఓ రేంజ్ ప్లానింగులు వేశారు. కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ కొట్టేసి ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్ లు కల టీజర్ గా సెట్ చేస్తామని ఓ రేంజ్ ప్లానింగులు వేశారు.

కానీ మూడు రోజులు కావస్తున్నా సరే ఆ టార్గెట్ రీచ్ కాకపోవడం గమనార్హం. మరి అలా అని ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ ను తక్కువ అంచనా వేసినా కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే ఒక రీమేక్ సినిమాకు అలాగే పెద్దగా ప్రమోషన్స్ కూడా చెయ్యకుండానే ఇప్పుడు మన టాలీవుడ్ టాప్ 2 మోస్ట్ లైక్డ్ టీజర్ గా నిలిచింది.

అయితే పవన్ కనుక ఇలా రీమేక్ కాకుండా ఒక స్ట్రయిట్ సినిమాతో వచ్చి ఉంటే డెఫినెట్ గా దానికి మరింత స్థాయి రెస్పాన్స్ వచ్చి ఉండేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గాను థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :

More