చరణ్ కి రిప్లై ఇచ్చిన పవన్ !

Published on May 30, 2018 7:12 pm IST

మెగా ఫ్యామిలీ లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే విషయంలో ముందు వరుసలో ఉంటాడు రామ్ చరణ్ . బాబాయ్ అంటే తనకు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవల ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన చరణ్ ను విలేకర్లు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున ప్రచారం చేస్తారా అని అడగడం దానికి చరణ్ బాబాయ్ ఎప్పుడు పిలుస్తారో అని వెయిట్ చేస్తున్నానని అయన పిలిచినా మరు క్షణం ప్రచారానికి వెళ్లిపోతానని అనడం మనకు తెలిసిందే.

ఇప్పుడు ఈ విషయం ఫై తాజాగా మీడియా సమావేశంలో పవన్ స్పందించారు . తాను ఎవరిని ప్రత్యేకించి పిలువనని ఇష్టం ఉంటే ఎవరైనా రావొచ్చునని ఈ విషయంలో కుటుంభ సభ్యులైన ఎవరైనా ఒకటేనని తమ ఇష్టం తోనే రావాలని ఒకవేళ నా తరుపున ప్రచారం చేయటానికి వచ్చినా ఒకటి పది సార్లు ఆలోచింఛుకున్న తరువాతే రమ్మని చెబుతానని వివరించారు. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ లో 45 రోజులపాటు చేపడుతున్న పోరాట యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :