
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ తొలిసారిగా ఒక దేవుడి పాత్రలో నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తిరమైన చర్చ నడుస్తుంది. పవన్ తన ఆహార్యం(గెటప్) ఎలా ఉండాలి అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ట్రెండీగా జీన్స్, టీ షర్ట్ వేసుకొని యూత్ ఐకాన్ లా పవన్ కనిపిస్తారు. ‘గోపాల గోపాల’లో పవన్ పాత్రను ఈ విధంగానే డిజైన్ చేశారు.
నేటి నుండి పవన్ ‘గోపాల గోపాల’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న పవన్ తిరిగి ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయ్యారు. చాలా హాండ్సమ్ గా తయారయ్యారట. ‘ఓ మై గాడ్’లో అక్షయ్ కుమార్ పాత్ర కంటే పవన్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని సమాచారం. పవన్, వెంకి మధ్య డైలాగులు ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయని టాక్. సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి నిర్మాతలు సురేష్ బాబు, శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు.