రామ్ సరసన పవన్ హీరోయిన్ !

పవన్ కళ్యాణ్ సరసన చేసిన ‘అత్తారింటికి దారేది’తో ఒక మెరుపు మెరిసిన నటి ప్రణీత సుభాష్ కు ఆ తర్వాత చెప్పుకోదగిన బ్రేక్ దొరకలేదు. ఈ మధ్యలో పలు ఆఫర్లు వచ్చినా వాటన్నిటినీ పక్కనబెట్టిన ఆమె సరైన పాత్ర కోసం ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు ఫలితంగా ఆమెకు యంగ్ హీరో రామ్ సినిమాలో అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.

‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే పేరుతో సినిమాకు సైన్ చేశారు. ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలోనే ప్రణీత నటించనుంది. ఆమెతో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడ రామ్ సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు.