“శంకరాభరణం” పై పవన్ కళ్యాణ్ కామెంట్స్!

Published on Feb 4, 2023 2:03 am IST


కళా తపస్వి కే. విశ్వనాథ్ గారి మృతి సినీ పరిశ్రమ ను విషాదం లో నింపింది. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, నివాళి అర్పించారు.

పవన్ కళ్యాణ్ కే. విశ్వనాథ్ గారి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే. విశ్వనాథ్ గారు స్వర్గస్తులైనందుకు మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. శంకరాభరణం అనే సినిమా వచ్చిందని తెలియదు, ఆరోజుల్లో. పాశ్చాత్య సంగీతం పై నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైమ్ లో మన సంస్కృతీ, కర్ణాటక సంగీతం,వీటిలో ఇంత గొప్పగా ఉంటది, ఇంత రస భరితంగా ఉంటది అని నాకు తెలియ జేసింది ఈ చిత్రం. యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే నేను, స్కూల్ లో చదువుకొనే రోజుల్లో సినిమా చూసాను. మనసుకు హత్తుకుపోయింది అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

సంబంధిత సమాచారం :