పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెచ్చిన “నీ కోసం”.

Published on Aug 24, 2019 7:08 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీకోసం’ ని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈచిత్రం మంచి విజయం సాధించాలని కోరకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అని అన్నారు. కాన్సెప్ట్ గురించి తెలుసుకొని ఈ మూవీ లో హీరోగా చేస్తున్న అజిత్ రాధారాం ని అభినందించారు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్సాన్స్ ని రాబట్టుకుంది. కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తూనే కథ, కథనం పరంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా బాగుందని అభినందిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం ‘నీకోసం’ సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది.

నవీన్ క్రియేషన్స్ పతాకంపై రాజలింగం సమర్పించిన ఈ మూవీకి అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :