ఎట్టకేలకూ పవన్ కూడా స్పందించాడు !

Published on Apr 17, 2019 9:21 pm IST

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమాకు ఎక్కువుగా మిక్సడ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం పాజిటివ్ టాక్ తో డీసెంట్ వసూళ్లను రాబడుతూ.. సాయి తేజ్ ఖాతాలో మరో హిట్ చిత్రంగా నిలిచింది.

కాగా ఇప్పటికే ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి, చిత్రలహరి చిత్రబృందాన్ని అలాగే సాయి తేజ్ నటనను మెచ్చుకున్నాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిత్రలహరి సినిమాను చూసి చిత్రబృందానికి మరియు సాయి తేజ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మీ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను’ అని బొకే పై రాసి మరి చిత్రబృందానికి పంపాడు.

సంబంధిత సమాచారం :