యాక్షన్ ఎపిసోడ్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్

యాక్షన్ ఎపిసోడ్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్

Published on Jul 28, 2015 7:45 PM IST

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న ‘సర్దార్’ సినిమా సెకండ్ షెడ్యూల్ రేపటి నుంచి మొదలు కానుందని మేము ఇదివరకే తెలియజేశాం. దాదాపు 7 నెలల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రానున్నాడు. అంతేకాదు ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. రేపు ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేయనున్నారు. పవన్ సినిమా కోసం టోటల్ గా తన లుక్ ని మార్చుకున్నాడు. లుక్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నారు.

ఓ న్యూ స్టైల్ తో రేపు కెమెరా ముందుకు రానున్నాడు. పవన్ కి పోటీ ఇచ్చే విలన్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ కనిపించనున్నాడు. పవర్ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయిన బాబీ ఈ సినిమాకి దర్శకుడు. మొదటి సారి పవన్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తుండడం వలన బాబీ కాస్త నర్వస్ గా కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం పవన్ కి సరిపోయే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు. సెకండ్ షెడ్యూల్ నుంచి కంటిన్యూగా షూటింగ్ చేసి సినిమా షూటింగ్ ని చేయనున్నారు. శరత్ మరార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ ని కూడా కంపోజ్ చేసేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు