సినిమాల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్.. టైం ఉందంటారా..?

సినిమాల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్.. టైం ఉందంటారా..?

Published on Jul 3, 2024 9:32 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా బాధ్య‌త‌లు తీసుకుని ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. దీంతో ఆయ‌న అభిమానులు సంతోషంగా ఉన్న‌ప్ప‌టికీ, సినిమాల ప‌రంగా కాస్త నిరాశ‌కు గుర‌వుతున్నారు. ప‌వ‌న్ నుంచి ఒక్క సినిమా వ‌చ్చినా అభిమానులు సంతోషిస్తార‌ని అంటున్నారు. అయితే, ప‌వ‌న్ ఇప్పటికే ఓజి, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాల‌ను ప‌ట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలు ఎప్పుడు వ‌స్తాయా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌పై తాజాగా ఓ కామెంట్ చేశారు.

పిఠాపురంలోని ఉప్పాడ‌లో జ‌రిగిన వారాహి బ‌హిరంగ స‌భ‌లో ప‌వన్ క‌ళ్యాణ్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా అభిమానులు ఓజి.. ఓజి అంటూ నినాదాలు చేశారు. దీంతో ప‌వ‌న్ ”సినిమాలు చేసే టైం ఉందంటారా.. ముందు గ్రామాల్లోని రోడ్ల‌ను బాగు చేసి.. కుదిరిన‌ప్పుడ‌ల్లా సినిమా షూటింగ్ లో పాల్గొంటాన‌ని నిర్మాత‌ల‌ను రిక్వెస్ట్ చేశాను.. ఓజి అని నేనంటే…క్యాజీ అని అంటారేమో.. మూడు నెల‌లు ఆగండి.. చూద్దురుగాని.. బాగుంటుంది” అని అన్నారు.

దీంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేశారు. త‌మ అభిమాన హీరో నోటి వెంట ఓజి బాగుంటుంద‌నే మాట రావ‌డంతో వారు ఈ సినిమా కోసం మ‌రింత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఓజి చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తుండ‌గా డివివి దాన‌య్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు