లేటెస్ట్ : రీమేక్ మూవీలో తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసిన పవన్

Published on Mar 26, 2023 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కీలక పాత్రల్లో కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీ తమిళ్ లో మంచి విజయం ఆదుకున్న వినోదయ సిత్తం కి రీమేక్ గా రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీలో కేతిక శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ మూవీలో నేటితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పవన్ 22 రోజుల డేట్స్ కేటాయించారు. కాగా నటుడు పవన్ కి దర్శకుడు సముద్రఖని ఒక సీన్ విషయమై సూచనలిస్తున్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :