“ఆర్ ఆర్ ఆర్” తరువాత చరణ్ మూవీలో పవన్ గెస్ట్ రోల్…?

Published on Jun 23, 2019 12:00 am IST

నటుడు నాగబాబు తాజాగా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేస్తారా?లేదా? అనే విషయాల గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. తమ్ముడు పవన్ ఇక పూర్తి స్థాయి హీరోగా నటించడం అనేది జరగదు. ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలనుకుంటున్నారు. కనుక పవన్ ని హీరోగా తెరపై కనిపించే పరిస్థితి లేదని ఆయన కొందరి అనుమానాలను నివృత్తి చేశారు.

ఐతే ఆసక్తి కరంగా ఆయన మరో విషయం చెప్పారు. పవన్ ఒకవేళ గెస్ట్ రోల్ గా చేసే అవకాశం మాత్రం ఉంది కానీ పూర్తిస్థాయి హీరోగా చేయరంటూ, కొత్త అనుమానాలకు తెరలేపారు. ఎప్పటినుండో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ మూవీ చేయాలని భావిస్తున్నారు. పవన్ రాజకీయాలలో బిజీ కావడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. నాగ బాబు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే,”ఆర్ ఆర్ ఆర్” తరువాత చరణ్ నటించే మూవీలో పవన్ చివరి సారిగా చరణ్ మూవీలో అతిధి పాత్రలో కనిపిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే కనుక జరిగితే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. మరి చూడాలి ఏమవుతుందో.

సంబంధిత సమాచారం :

X
More