భారీ విరాళం ప్రకటించిన పవన్.

Published on Mar 26, 2020 9:17 am IST

పవన్ కళ్యాణ్ మరో మారు తన ఔదార్యం చాటుకున్నారు. ఏకంగా కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించారు. కరోనా పై యుద్ధంలో భాగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సినీతారలు మరియు ప్రముఖులు విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెరో 50 లక్షలు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయన ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కొరకు మరో కోటి రూపాలు విరాళంగా ప్రకటించడం విశేషం. ఇలా మొత్తంగా ఆయన రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.

ఇక పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా మే లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అలాగే దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఆయన ఓ భారీ పీరియాడిక్ మూవీ చేస్తుండగా, చిత్రీకరణ దశలో ఉంది.

సంబంధిత సమాచారం :

More