పవర్ స్టార్ ప్లాప్ సినిమాకు 100 మిలియన్లు.!

పవర్ స్టార్ ప్లాప్ సినిమాకు 100 మిలియన్లు.!

Published on Sep 29, 2019 11:00 PM IST

Agnyaathavaasi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు కాస్త దూరంగా ఉంది.ఆ పేరు కాస్తా ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గా మారి బిజీగా ఉండగా.కానీ పవర్ స్టార్ అనే పేరులో ఉండే మ్యాజిక్ మాత్రం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.పవన్ హీరోగా ఉన్నన్ని ఏళ్ళు ఏళ్ళు టాక్ తో ఎలాంటి సంబంధము లేకుండా మినిమం 50 నుంచి 60 కోట్ల షేర్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి.

అలాగే డే 1 లో కూడా అనేక రికార్డులు నెలకొల్పిన సినిమాలు కూడా ఉన్నాయి.కానీ పవన్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యి రాజకీయాల్లోకి వెళ్లిపోతానని చేసిన చివరి సినిమా “అజ్ఞ్యాతవాసి” మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.కానీ ఈ చిత్రం మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.కానీ ఈ చిత్రం మాత్రం ఇప్పుడు 100 మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది.

ఇప్పటికే మన తెలుగు సినిమా తాలూకా హిందీ డబ్బింగ్ వెర్షన్లను హిందీ ప్రేక్షకులు ఏ స్థాయిలో వీక్షిస్తారో అందరికి తెలిసిందే.అదే విధంగా ఈ చిత్రం హిందీ వెర్షన్ ను “ఎవడు 3″గా డబ్ చేసి పెట్టారు. తాజాగా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న మొదటి పవన్ కళ్యాణ్ సినిమాగా నిలిచింది.మన దగ్గర ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోని ఈ చిత్రం హిందీ వెర్షన్ లో 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం ఆషామాషీ వ్యవహారం అయితే కాదు.

Agnyaathavaasi2

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు