వింటేజ్ మోడ్ తో సూపర్ కిక్కిస్తున్న పవర్ స్టార్.!

వింటేజ్ మోడ్ తో సూపర్ కిక్కిస్తున్న పవర్ స్టార్.!

Published on Feb 3, 2021 7:13 PM IST

pawan
ఏ హీరో అభిమాని మాత్రం అనుకోడు తన హీరో మళ్ళీ ఓల్డ్ స్టైల్ ను ఇప్పుడు మిక్స్ చేసి ట్రీట్ ఇస్తే వారికి అంతకంటే ఇంకేం అక్కరలేదు అనుకుంటారు. మరి అలాంటి హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే వారి అభిమానులు కూడా ఉంటారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సెట్ చేసిన ట్రెండే వేరు అసలు..అందుకే ఆ టైం యూత్ అంతా పవన్ అంటే ఆ రేంజ్ లో ఫాలో అయ్యేవారు.

అయితే ఆ టైం లో పవన్ సెట్ చేసిన ట్రెండ్ స్టైల్స్ లో తాను చేసిన “జాని” కూడా ఒకటి. అందులో ఓ కర్చీఫ్ తో పవన్ చేసిన హంగామా మాములుగా ఉండేది కాదు. మరి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆ కర్చీఫ్ తోనే సాగర్ చంద్ర దర్శకత్వంలో రానా తో చేస్తున్న అయ్యప్పణం కోషియం రీమేక్ షూట్ లో కనిపించి ఆశ్చర్య పరిచారు.

ఆన్ సెట్స్ లో పవన్ చేతికి కట్టుకున్న ఆ కర్చీఫ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దీనితో మళ్ళీ పవన్ తన వింటేజ్ కిక్ ను తన ఫ్యాన్స్ కు ఇచ్చాడు. మరి ఈ సినిమాలో ఎక్కడ ఆ సన్నివేశం పెడతారో కానీ థియేటర్స్ మాత్రం అప్పుడు దద్దరిల్లడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వాయు నిర్మాణం వహిస్తున్నారు.

pawan kalyan

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు