‘పవన్’ సినిమా కొత్త షెడ్యూల్ ఫిక్స్ !

‘పవన్’ సినిమా కొత్త షెడ్యూల్ ఫిక్స్ !

Published on Jun 21, 2021 3:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షెడ్యూల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జులై మూడో వారం నుండి ఈ సినిమా షూట్ మొదలు కానుందట. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ సినిమా కోసం ప్రత్యేక ఫోటోషూట్‌ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ ఈ సినిమాలో కొత్త లుక్ తో పాటు కొత్త హెయిర్ స్టైల్ ను ప్లాన్ చేసున్నారట. ఇక ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు.

అయితే ఈ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. కాగా గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు. అందుకే వీరి సినిమా పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు