పవన్ – హరీష్ శంకర్ ల మూవీ అప్ డేట్ ఆరోజే ?

పవన్ – హరీష్ శంకర్ ల మూవీ అప్ డేట్ ఆరోజే ?

Published on Dec 10, 2022 3:03 AM IST


ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీ తరువాత హరీష్ శంకర్ తో ఒక మూవీ అలానే మరొక దర్శకుడు సుజీత్ తో మరొక మూవీ కూడా చేయడానికి సిద్ధం అయ్యారు పవర్ స్టార్. ఈ రెండు సినిమాల యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ ఇటీవల వచ్చాయి. అయితే విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తో తాను చేయనున్న మూవీకి సంబంధించి అతి త్వరలో ఒక భారీ అప్ డేట్ రానుంది రెడీగా ఉండండి అంటూ దర్శకడు హరీష్ శంకర్ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ అప్ డేట్ డిసెంబర్ 11 న రానున్నట్లు చెప్తున్నారు. పదేళ్ల క్రితం పవర్ స్టార్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ అతి పెద్ద విజయం అందుకోవడంతో మళ్ళి చాలా గ్యాప్ తరువాత మరొక్కసారి ఈ క్రేజీ కాంబో సిద్ధం అవడంతో ఈసారి వీరిద్దరి కలయికలో మూవీ ఎలా ఉంటుందో చూడాలని పవన్ ఫ్యాన్స్ తోపాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ భారీ అప్ డేట్ ఏమై ఉంటుందో తెలియాలి అంటే మరొక రెండు రోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు