హిందీలో అమితాబ్ అయితే తెలుగులో పవన్ కళ్యాణ్

హిందీలో అమితాబ్ అయితే తెలుగులో పవన్ కళ్యాణ్

Published on Jan 12, 2015 10:37 PM IST

Gopala-Gopala-(3)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినవ కృష్ణుడిగా నటించిన ‘గోపాల గోపాల’ కలెక్షన్ల పరంగా టాప్ 4లో కొనసాగుతూ వస్తుంది. హిందీ సినిమా ‘ఓ మై గాడ్’ కి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మరమ్మత్తులు జరిపి దింపిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు సినిమాలో రాయబడ్డ పంచ్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. హిందీ వెర్షన్ కోర్టు సీన్ లో అక్షయ్ కుమార్ నేను దేవుడ్ని అని పరిచయం చేసుకుంటే పక్కన వున్న కుర్రాడు నువ్వే దేవుడివైతే నేను అమితాబ్ బచ్చన్ అని అంటాడు. తెలుగులో అదే సీన్ పవన్, ధనరాజ్ ల మధ్య చిత్రీకరించారు. విశేషమేమిటంటే ధనరాజ్ పవన్ పక్కన పవన్ నే ఇమిటేట్ చేస్తూ నువ్వు దేవుడివైతే నేను పవన్ కళ్యాణ్ ని అంటాడు. ఈ డైలాగ్ కి ప్రేక్షకుల రెస్పాన్స్ అదిరింది

‘గోపాల గోపాల’ సినిమాను దర్శకుడు డాలీ తెరకెక్కించాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. శరత్ మరార్, సురేష్ బాబులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు

తాజా వార్తలు