దిల్ రాజుకు పవన్ కీలక సూచనలు.!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో మొదటి వరుసలో ఉన్న చిత్రం “వకీల్ సాబ్”. ఈ చిత్రం షూట్ మాత్రం దాదాపు అంతిమ దశలో ఉంది. చాలా కాలం విరామం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ లాక్ డౌన్ మూలాన అన్ని ఆశలకు పెద్ద బ్రేక్ వచ్చి పడింది.

పైగా ఇప్పటికే ఈ చిత్రం విషయంలో చాలా లేట్ కావడంతో పవన్ నిర్మాత దిల్ రాజుకు పలు కీలక సూచనలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ పై త్వరగా దృష్టి పెట్టాలని అలాగే సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన పోస్టర్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చెయ్యాలని సూచించారట.

ఇవన్నీ ఫ్యాన్స్ మరియు సినీ వర్గాల్లో మంచి ఇంపాక్ట్ కలిగిస్తాయని పవన్ అంచనా అందుకే ఇంకా లేట్ చెయ్యకూడదని ఇలా ప్లాన్ చెయ్యమన్నట్టు ఇప్పుడు సమాచారం. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పవన్ సరసన శృతి హాసన్ సెట్స్ లో తొందరలోనే జాయిన్ కానుంది. మరి దిల్ రాజు పవన్ సూచనల మేర ఎలాంటి ప్లానింగ్స్ వేస్తారో చూడాలి.

Exit mobile version