“వీరమల్లు”లో పవన్ స్పెషల్ లుక్స్ తో ఫీస్ట్.!

Published on Mar 15, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఉన్నది నో డౌట్ గా “హరి హర వీర మల్లు” అనే చెప్పాలి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో పవన్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా ఏ లెవెల్ కు వెళ్ళాయో చూసాం. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో పవన్ లుక్ కోసం స్పెషల్ గా చెప్పుకోవాలి.

పవన్ ఇది వరకు ఎన్నడూ చేయని పీరియాడిక్ సినిమా కాబట్టి అందుకు తగ్గట్టుగా ఒక వారియర్ రోల్ లో కనిపిస్తున్నాడు. దానినే టీజర్ గ్లింప్స్ లో క్రిష్ సూపర్బ్ గా చూపించారు. వాటిలో పవన్ కాస్ట్యూమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి వీటితోనే మట్టం 30 రకాల కాస్ట్యూమ్స్ లో పవన్ కనిపించనున్నడట.

క్రిష్ గత పీరియాడిక్ చిత్రాలు “కంచె” అలాగే “గౌతమీ పుత్ర శాతకర్ణి” చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన ఐశ్వర్య రాజీవ్ పవన్ తో చేస్తున్న ఈ హరి హర వీరమల్లు కి కూడా పని చేస్తున్నారట. ఆమె ఈ స్పెషల్ అంశాన్ని రివీల్ చేశారు. సో 30 రకాల కాస్ట్యూమ్స్ లో పవన్ లుక్స్ ఈ చిత్రంలో ఫీస్ట్ ఇవ్వడం పక్కా అని చెప్పాలి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :