
సినిమాల్లో పవర్ స్టార్‌గా అశేష అభిమానాన్ని పొందుతున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల తరపున పోరాడటమే తమ ఎజెండా అని చెబుతూ గత ఎన్నికల సమయంలో ‘జనసేన’ పేరుతో పవన్ ఓ రాజకీయ పార్టీని నెలకొల్పారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చిన పవన్, ఆ క్రమంలో పలుమార్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు సైతం గుప్పించారు.
ఈ మధ్యే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఓటుకు నోటు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సుధీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై ఆయన కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేశారు. దీంతో వారిలో కొంతమంది పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇక తనపై కేసు పెట్టాలని చూస్తున్న వారిపై పవన్ కళ్యాణ్ మళ్ళీ తన స్టైల్లో ట్విట్టర్‌లో స్పందించడం విశేషంగా కనిపిస్తోంది. ప్రజల మంచి కోసం నేను జైలుకెళ్ళడానికైనా, కోర్టుకెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటా. ముందుగా ప్రజలకు మంచి చేసే దిశగా ఆలోచించడి అంటూ ట్విట్టర్‌లో స్పందించారు పవన్.
I will be very happy to go to Jail n facing Courts and please kindly do the needful.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2015
Previous Tweet was in the context of’some group wanting to lodge a police complaint and file a case against me’ regarding what I had Spoken.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2015

