పవన్ సినిమా ప్రిఫరెన్స్ తగ్గిపోతుందా.?

Published on Oct 27, 2020 11:00 am IST

గతంలో ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున సినిమాలను కమిట్ అయ్యి ఒక దాని తర్వాత మరొకటి లైన్ లో పెట్టేసారు. ఇది అతని అభిమానులకు ఆనంద దాయక విషయమే. సరే ఇది బాగానే ఉన్నా పవన్ ఇప్పుడు ఓకే చేసిన వరుస చిత్రాలకు సంబంధించి మాత్రం ఒక్కో రకమైన అంచనాలు నెలకొన్నాయి.

దాదాపు 5 చిత్రాలు పవన్ చేతిలో ఉన్నాయి. కానీ వీటన్నిటిలో మాత్రం అసలు పవన్ కం బ్యాక్ చిత్రంగా అనుకున్న చిత్రం తాలూకా ప్రిఫరెన్సే క్రమంగా తగ్గుతుండడం గమనార్హం. ఇది లేటెస్ట్ గా పవన్ ఫ్యాన్స్ పల్స్ ఆధారంగానే వినిపిస్తున్న అంశం. శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ ఆ మధ్య అంతా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ క్రమంగా మరిన్ని ఊహించని ప్రాజెక్టులు లైన్ లోకి రావడంతో ఈ సినిమా ప్రిఫరెన్స్ తగ్గినట్టయ్యింది. ఆ మధ్యన అయితే ఈ చిత్రాన్ని ఓటిటికి ఇచ్చేసినా పర్వాలేదని అభిప్రాయానికి పవన్ అభిమానులు వచ్చేసారు. అయితే ఎంత కాదనుకున్నా ఇది పవన్ కం బ్యాక్ చిత్రం కావడమే కాకుండా దర్శకుడు శ్రీరామ్ వేణు అలాగే థమన్, దిల్ రాజులకు ఇది పవన్ తో మొదటి సినిమా. మరి మేకర్స్ ఇక నుంచి చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More