బర్త్ డే బొనాంజ: పవన్ సినిమాల అప్డేట్స్ టైమింగ్స్ ఇవే..!

Published on Sep 2, 2021 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నేడు అతిపెద్ద పండుగ అనే చెప్పాలి. పవన్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి నేడు వరుస అప్డేట్స్ రాబోతున్నాయి. ఇక మొదటగా చూసుకుంటే పవన్ హీరోగా రానా దగ్గుబాటితో కలిసి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో చేస్తున్న “భీమ్లా నాయక్”కి సంబంధించి రేపు ఉదయం 11:16 గంటలకు ఫస్ట్ సింగిల్ రాబోతుంది.

ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్త్గున్న పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి మధ్యాహ్నాం 1:20 నిమిషాలకు అప్డేట్ రాబోతుంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించి మధ్యాహ్నాం 2:20 నిమిషాలకు అప్డేట్ రానుంది. ఇదే కాకుండా హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్త్గున్న సినిమా నుంచి సాయంత్రం 4:05 నిమిషాలకు అప్డేట్ రానుంది. మరి ఇన్ని అప్డేట్స్ ఒకేసారి వస్తే పవన్ అభిమానులకు ఈ రోజు ఎప్పటికీ గుర్తిండిపోవడం ఖాయమనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :