కొత్త కారును బుక్ చేసుకున్న పవర్‌స్టార్.. ధర ఎంతంటే?

Published on Jul 2, 2021 3:00 am IST


పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నిరాడంబరమైన వ్యక్తి. సాదా సీదాగా ఉండేందుకే ఆయన ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. హంగులు, ఆర్భాటాల జోలికి పెద్దగా పోడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురుంచి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఓ లగ్జీరియస్ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ గల కొత్త కారును కొనబోతున్నారని, ఇప్పటికే ఆర్డర్ కూడా చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కారు ధర అక్షరాల రూ.4 కోట్ల రూపాయలట. అయితే పవన్‌కు లగ్జరీ కార్లపై మక్కువ లేకపోయినా రాజకీయంగా, సినిమాపరంగా ప్రయాణాలు చేసేందుకు సౌకర్యంగా ఉండడం కోసమే అంత బడ్జెట్ పెట్టి కొన్నాడట. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు కానీ ఒకవేళ కొత్త కారు కొంటే అందులో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కనిపిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :