పవన్ స్టార్ పవర్ ఇంకా తగ్గలేదు

Published on Mar 2, 2020 7:03 am IST

పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన క్రేజ్ తారా స్థాయిలో ఉండేది. కలెక్షన్ల నుండి రికార్డుల వరకు అన్నిటిలోనూ ఆయన ట్రేడ్ మార్క్ సెట్ చేసేవారు. కానీ సినిమాలు వదిలేసి రెండేళ్లవుతున్నా ఆ స్టార్ పవర్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. పవన్ రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదలకానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.

దీంతో పవన్ అభిమానుల్లో పాట ఉత్సాహం మొదలైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇది ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలవగా రేపు ఫస్ట్ లుక్ విడుదలకు టైటిల్ ట్యాగ్ ట్వీట్స్ మూడున్నర మిలియన్లకు చేరుకోవాలని కొత్త టార్గెట్ పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More