పవన్ తోనా ఎన్టీఆర్ తోనా ఆసక్తికరంగా మారిన అప్డేట్.!

Published on Oct 25, 2020 10:02 am IST

ఈ దసరా సందర్భంగా ఇప్పుడు మన టాలీవుడ్ లో పలు భారీ చిత్రాలకు సంబంధించి అనౌన్స్ మెంట్ లు రెడీ అవుతున్నాయి. అయితే కాస్త ముందు నుంచే అలెర్ట్ చేసిన పలు భారీ నిర్మాణ సంస్థలు కొన్ని సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయని ముందే హింటిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సరైన అప్డేట్ లేక ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని వారు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉందని తెలిపారు. దీనితో అదేంటా అని చర్చ మొదలయిన నేపథ్యంలో పవన్ తో సినిమాకు చెందిన అప్డేటే అని టాక్ సంతరించుకుంది. సినీ వర్గాల్లో గట్టి టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇదే బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబోలో రెండో సినిమా కూడా ఉంది. మరి ఈ రెండిట్లో ఏ అప్డేట్ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండిట్లో ఒకటా లేక వేరే ఏమన్నా ఇస్తారా అన్నది ఈ 10 గంటల 35 నిమిషాలకు తేలిపోతుంది.

సంబంధిత సమాచారం :

More