పవన్ పాన్ ఇండియన్ సినిమా ఇక అప్పటికే ఏమో.!

Published on Jun 29, 2021 7:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు బిగ్ ప్రాజెక్ట్ లలో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా అని కాకున్నా ఈ కాంబోపై సెపరేట్ క్రేజ్ నెలకొంది. పైగా ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ కి కూడా భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరో స్థాయిలో నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు షూట్ బాగా లేట్ అవ్వడం మూలాన ఈ చిత్రం అనుకున్న ఆ టైం కి రావడం కష్టమే అని తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం కూడా సమ్మర్ రేస్ లోకే వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం అయితే పవన్ అయ్యప్పణం రీమేక్ కోసం సన్నద్ధం అవుతున్నారు. అలాగే వీరమల్లు కూడా కొంచెం గ్యాప్ తర్వాత షురూ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :