సినిమా చూసి హీరోకి ఫ్లవర్ బొకే పంపిన పవన్ కళ్యాణ్ !

సినిమా చూసి హీరోకి ఫ్లవర్ బొకే పంపిన పవన్ కళ్యాణ్ !

Published on Feb 1, 2017 9:02 PM IST

shiva reddy
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా అరుదుగా సినిమాలు చూస్తుంటారు. అలాంటి ఆయన తాజాగా ఒక హీరో సినిమా చూసి అతన్ని అభినందిస్తూ ఫ్లవర్ బొకే కూడా పంపారు. ఆ హీరో పెద్ద స్టార్ హీరోనా అంటే అదీ కాదు. ఈ మధ్యనే కమెడియన్ నుండి హీరోగా మారిన వ్యక్తి. ఆయనే శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే హీరోగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో తోలి అడుగువేశారు.

ఆ సినిమా ప్రేక్షకులను, విమర్శకులను బాగా మెప్పించింది. నటుడిగా శ్రీనివాస్ రెడ్డి స్థాయిని కూడా పెంచింది. సినిమా చూసిన చాలా మంది శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు. పవన్ తాజాగా ఈ సినిమా చూసి ‘నువ్వొక మంచి సినిమా చేశావు. సినిమా చూసి ఎంజాయ్ చేశాను. నీకు నా బెస్ట్ విషెస్’ అని అభినందిస్తూ ఒక గులాబీ బొకేని శ్రీనివాస్ రెడ్డికి పంపారు. పవన్ ఆకస్మిక విషెస్ తో థ్రిల్ ఫీలైన శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెబుతూ పవన్ కు థ్యాంక్స్ చెప్పారు.

తాజా వార్తలు