పక్కా ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ సినిమాలు!

Published on Feb 27, 2023 6:36 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో యాక్టిివ్ గా ఉంటూనే, ఇటు వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ప్రస్తుతం నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం లో నటిస్తున్నారు పవన్. ఈ చిత్రం లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను మార్చ్ వరకూ పూర్తి చేయనున్నారు. తన నెక్స్ట్ మూవీ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఓజీ కి ఏప్రిల్ నుండి 45 రోజుల పాటు సమయం కేటాయించనున్నారు.

హరిహర వీరమల్లు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఓజీ మరియు హరిహర వీరమల్లు చిత్రాలతో తెరకెక్కించనున్నారు మేకర్స్. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉండగా, దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న చిత్రాలు పూర్తి చేసి, పొలిటికల్ గా మరింత యాక్టిివ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు పవన్.

సంబంధిత సమాచారం :