పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేశారు. అయితే, ఆయన తన నైతిక విలువలతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. లక్షలాది మంది యువతకు ఆదర్శంగా నిలిచే ఆయన, సమాజ హితం కోసం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఒక ప్రముఖ పొగాకు కంపెనీ తమ బ్రాండ్ ప్రకటన కోసం పవన్ కళ్యాణ్‌కు ఏకంగా రూ.40 కోట్ల భారీ ఆఫర్‌ను ఇచ్చింది. అయితే, యువత ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే పొగాకు, సిగరెట్ వంటి హానికర ఉత్పత్తులను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయనని ఆయన ఆ ఆఫర్‌ను ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రిజెక్ట్ చేశారు.
డబ్బు కంటే విలువలే ముఖ్యమని చాటిచెప్పిన పవన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తమ హీరో కోట్లు ఇచ్చినా తప్పుడు పనులు చేయరంటూ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క పనితో పవన్ తన అభిమానుల్లో మరోసారి రియల్ హీరోగా మారిపోయారు.


