రీమేక్‌ని రీ షూట్ చేయమని అడిగిన పవన్?

Published on Jul 18, 2021 1:47 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికిడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇటీవల ఓ షాక్ తగిలింది. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కొన్ని కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

అయితే ఆయన వెళ్ళాక అప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన పవన్ కళ్యాణ్ టెంపో సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు మొదటి నుంచి మళ్లీ రీ షూట్ చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల స్థానంలో రవి కె చంద్రన్ వచ్చి చేరాడు. అయితే త్వరలోనే మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.

సంబంధిత సమాచారం :