
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న తదుపరి సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇటీవలే హైదరబాద్ షెడ్యూల్ పూర్తి చేసి 10 రోజుల షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్ళింది సర్దార్ టీం. అక్కడ పవన్ కళ్యాణ్ పై వచ్చే కొన్ని సీన్స్ తో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ ని ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం తిరిగి హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడ షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చిన ఈ చిత్ర టీం నవంబర్ మొదటి వారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్రెష్ షెడ్యూల్ ని స్టార్ చేయనున్నారు.
సుమారు 20 రోజుల పాటు జరిగే హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర టీం ఓ మేజర్ షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ శరవేగంగా ఈ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సరసన మొదటి సారి కాజల్ అగర్వాల్ జోడీ కడుతున్న ఈ సినిమాకి పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. లక్ష్మీ రాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడమే కాకుండా ఓ ముఖ్య పాత్రలో కూడా కనిపించనుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.