పవన్ కరోనా టెస్ట్ రిజల్ట్ వచ్చేసింది.!

Published on Apr 16, 2021 11:00 am IST

మళ్ళీ మన దేశంలో కరోనా ప్రభావం తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతూ వస్తుందో తెలిసిందే. మరి ఇదిలా ఉండగా సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా రావడంతో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్ చెయ్యించుకోగా ఇప్పుడు దాని ఫలితం వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో కరోనా టెస్ట్ చేయించుకున్న పవన్ కు నెగిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీనితో పవన్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక పవన్ ప్రస్తుతం మార్ మల్టీ స్టారర్ “అయ్యప్పణం” రీమేక్ లో అలాగే క్రిష్ తో భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :