పవన్ కళ్యాణ్ ‘సర్దార్’ సెకండ్ షెడ్యూల్ డీటైల్స్

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు ఓ పిచ్చి క్రేజ్ అని చెప్పాలి. పవన్ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం అలాంటి అంచనాల నడుమ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ‘సర్దార్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకి ముందుగా గబ్బర్ సింగ్ 2 అనే టైటిల్ అనుకున్నా ఫైనల్ గా ‘సర్దార్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. షూటింగ్ మొదలైన ఈ సినిమా ఫస్ట్ అండ్ షార్ట్ షెడ్యూల్ పూణేలో జరిగింది. ఆ తర్వాత ఈ చిత్ర టీం ఈ సినిమా కోసం పలు లొకేషన్స్ ని ఫైనలైజ్ చేసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జూలై చివరివారంలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో జాయిన్ అవనున్నాడు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పెంచుతున్న గడ్డం, ఈ సినిమా టైటిల్ ని బట్టే పవన్ ఈ సినిమాలో కొంతభాగం సర్దార్ గెటప్ లో కనిపిస్తాడని ఆశించవచ్చు. పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. పవన్ కోసం బాబీ పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేయడమే కాకుండా, మ్యూజిక్ సిట్టింగ్స్ లో దేవీశ్రీ నుంచి సూపర్బ్ సాంగ్స్ ని రాబట్టుకున్నాడని సమాచారం. మరాఠీ నటుడు శరత్ కేల్కర్ ని విలన్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత.

Exit mobile version