పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ త్వరలో వెండితెరపై సందడి చేయనున్నాడు. ఈ బుల్లి మెగా వారసుడి పరిచయానికి రంగం సిద్దమయ్యింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రేణు దేశాయ్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత కూడా రేణునే.
‘అకిరా నందన్ ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. నా కుమారుడి తొలి సినిమా నా స్వీయ దర్శకత్వంలో తెరకేక్కడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తన ఆనందాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా మరాఠీ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. తెలుగులో కూడా ‘ఇష్క్ వాలా లవ్’ను డబ్ చేస్తున్నట్టు గతంలో రేణు దేశాయ్ వెల్లడించారు.


