అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడట !

Published on Aug 23, 2018 12:28 am IST

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులు అందరూ ఆయన పుట్టిన రోజు వేడుకను ఓ పండుగలా జరుపుకుంటున్నారు. అయితే ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు చిరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుయజేశారు. అదే విధంగా పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ కూడా తన భార్య అన్నా లెజినోవా, కుమార్తె పొలెనా, కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ తో కలిసి స్వయంగా మెగాస్టార్ ఇంటికి వచ్చారు.

కాగా పవన్‌ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ రాకతో మెగాస్టార్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారట. మెగాస్టార్ పేరు కలిసేలా పవన్ తన చిన్న కుమారుడికి పేరు పెట్టిన విషయం తెలిసిందే. మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ కూడా అచ్చం పవన్ లానే ఉన్నాడని, పిల్లాడిలో పవన్ కళ్యాణ్ పోలికలే ఎక్కువుగా కనిపిస్తున్నాయని మెగా అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More