“వీరమల్లు” షూట్ పై పవన్ స్పెషల్ రిక్వెస్ట్.!?

Published on May 30, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో ఒకటి దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ అండ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి నిర్మాత ఏ ఎం రత్నం లేటెస్ట్ గా షూట్ పై అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను కూడా ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది.

దాని ప్రకారం పవన్ స్పెషల్ రిక్వెస్ట్ చేసారని తెలుస్తుంది. మళ్ళీ షూట్ మొదలు పెట్టిన సమయంలో ఖచ్చితంగా సక్రమమైన జాగ్రత్తలు తీసుకోవాలని సెట్ లో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్లాన్ చెయ్యాలని పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :