“వకీల్ సాబ్”లో అంజలి నటనకు పవన్ ఫిదా అట.!

Published on Apr 1, 2021 5:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్” పై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు నివేతా థామస్ మరియు అంజలి అనన్య పాండే లు కీలక పాత్రల్లో నటించారు.

వీరిలో అంజలి లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలనే పంచుకుంది. మొదటగా శ్రీరామ్ తన రోల్ పై చేసిన మార్పులు చేసి తనకి చెప్పగానే ఓకే చెప్పేసిందట. అంతే కాకుండా పవన్ సెట్స్ లో చాలా కామ్ గా ఉంటారని ఒకవేళ షూట్ లేకపోతే బుక్స్ చదవడమో లేక పడుకోవడంతో చేస్తారని తెలిపింది.

అలాగే తన రోల్ కోసం మాట్లాడుతూ ఓ సీన్ చాలా ఎమోషనల్ ఉంటుందని మరో సన్నివేశంలో అయితే తన నటనను చూసి పవన్ మెచ్చుకొని సెట్స్ లో చప్పట్లు కొట్టడం అయితే తాను ఈ సినిమా చెయ్యడం అంతటిలో మర్చిపోలేనిది అని ఆమె తెలిపింది. అలాగే ఈ సినిమా తర్వాత తాను తెలుగు మరియు తమిళ్ లో కూడా పలు సినిమాలు చేస్తున్నట్టుగా అంజలి తెలిపింది.

సంబంధిత సమాచారం :