యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అమితమైన సంతోషంతో గాల్లో విహరిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా అనూప్ కి ఫోన్ చేయడమే ఈ ఆనందానికి కారణం. ఈ ఫోన్ కాల్ జీవితాంతం గుర్తుండిపోతుందని అనూప్ సన్నిహితుల వద్ద వ్యాఖానించారు.
‘నా జీవితంలో గుర్తుండిపోయే రోజు.. బెస్ట్ డే.!!! పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి.. ఐ లవ్ యు అనూప్. తర్వాత వెంటనే ఏం చెప్పారో తెలుసా.. త్వరలో మనం కలిసి పనిచేయబోతున్నాం..! అని అన్నారు. అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు ఈ యువ సంగీత దర్శకుడు.
పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడంతో అనూప్ అగ్ర స్థానానికి చేరువలో ఉన్నట్టే. ‘గోపాల గోపాల’ మరియు ‘టెంపర్’ సినిమాలతో ఆల్రెడీ అనూప్ టాప్ లీగ్ కు చేరుకున్నారు. ఇప్పటికే, ‘గోపాల గోపాల’ మోషన్ పోస్టర్ కు అనూప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంది. పవన్ తదుపరి సినిమా ‘గబ్బర్ సింగ్ 2’కు అనూప్ సంగీతం అందిస్తారా..? లేదా మరో సినిమాకు కలి పని చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


